చివరకి పవన్ కళ్యాణ్ కూడా ఇలా చేస్తే ఎలా | ఇది చూసి పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేడు అని తిడుతున్నారు ప్రజలు

చివరకి పవన్ కళ్యాణ్ కూడా ఇలా చేస్తే ఎలా | ఇది చూసి పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేడు అని తిడుతున్నారు ప్రజలు 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం ట్వీట్లు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తూనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. విద్యార్థులు తమ విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోతుంటే ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయని పవన్ విమర్శించారు. ఎంతో డబ్బు, కాలాన్ని వెచ్చించి మోసపోయిన వాళ్ల బాధ దేవుడికి మాత్రమే తెలుసని పవన్ అన్నారు.
ఫాతిమా కాలేజీ యాజమాన్యం తప్పిదం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, వాళ్లకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబును కోరారు. అమాయకులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఫాతిమా కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.‘‘అభివృద్ధి చెందిన ఏ దేశంలోనైనా సరే ఫాతిమా కాలేజీ లాంటి ఘటన జరిగితే కాలేజీ లైసెన్స్‌ను రద్దు చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపండం చేస్తారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తారు. కానీ మన దేశంలో చట్టం అనేది బలహీనులకు ఒకలా, బలవంతులకు మరోలా పనిచేస్తుంది.’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Comments